కోహ్లీ వంద సెంచరీలు కొట్టగలడు

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ వంద సెంచరీలు కొట్టలగడని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అన్నారు. కోహ్లి నిలకడ అద్భుతంగా ఉంది. అతను ఫిట్‌గా ఉండగలిగితే వంద సెంచరీల మార్క్‌ను అందుకోగలడని అజర్ అభిప్రాయపడ్డారు.

టాపార్డర్ విజయవంతమైనప్పుడల్లా ఇండియా గెలుస్తూనే ఉంది. దురదృష్టవశాత్తు తొలి వన్డేలో చాలా త్వరగా మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ సెంచరీ చేసినా ఓడిపోయాం. కానీ రెండో వన్డేలో కోహ్లి, ధోనీ బాగా ఆడారు. చివర్లో ధోనీ అలసిపోయినా వికెట్ పారేసుకోలేదు. కార్తీక్ కూడా బాగా ఆడాడు అని అజర్ అన్నాడు.