పరువునష్టం కేసు : కోటిన్నర గెలిచిన క్రిస్‌ గేల్‌

వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ వివాదంలో విజయం సాధించాడు. పరువునష్టం కేసులో భాగంగా గేల్‌కు దాదాపు రూ.కోటిన్నర చెల్లించాలని ఆస్ట్రేలియా కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2015వరల్డ్ కప్‌ సమయంలో చోటు చేసుకున్న ఘటనపై 2016లో ఫైర్ ఫాక్స్‌ అనే మీడియా సంస్థ ప్రచురించిన కథనాలను ఖండిస్తూ గేల్‌ పరువునష్టం దావా వేశాడు. దీనిపై విచారించిన న్యూ సౌత్‌ వేల్స్‌ సుప్రీం కోర్టు జడ్జి లూసి మెకల్లమ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు.

2015 ప్రపంచకప్‌ సందర్భంగా డ్రస్సింగ్‌ రూమ్‌లో గేల్ ఉన్న సమయంలో మసాజ్‌ థెరపిస్ట్‌ ఆ గదికి వచ్చి టవల్ వెతుకుతోందని, అప్పుడు అక్కడే ఉన్న గేల్ తాను కట్టుకున్న టవల్ విప్పి నగ్నంగా మారిన గేల్.. ఆ టవల్ ఇదేనా అంటూ లీన్నె రస్సెల్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫెయిర్ ఫాక్స్ అనే మీడియా సంస్థ వరుసగా కథనాలను ప్రసారం చేసింది. ఫైర్ ఫాక్స్‌ అనే మీడియా సంస్థ ప్రచురించిన ఈ కథనాలను ఖండిస్తూ గేల్‌ పరువునష్టం దావా వేశాడు.