టీమిండియా@ దుబాయ్

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ కోసం రోహిత్‌ శర్మ నాయకత్వంలోని భారత జట్టు దుబాయ్‌ చేరుకుంది. రేపటి నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, హాంకాంగ్‌, ఆఫ్గానిస్థాన్‌ జట్లు ఈ టోర్నీలో పాల్గంటున్నాయి.

కాగా భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి కల్పించడంతో యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్‌ టోర్నీకి రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

రోహిత్‌ శర్మ ఓ సిరీస్‌కు పూర్తి స్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడం ఇదే తొలిసారి. కాగా రోహిత్‌ టీమిండియాకు నాయకత్వం వహించిన ప్రతిసారీ భారత్‌ విజేతగా నిలిచింది. దీంతో ఆసియా కప్‌ టోర్నీలో కూడా భారత్‌ విజేతగా నిలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.