భారత్‌ లక్ష్యం 163


ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగారు. ప్రత్యర్థిని 43.1 ఓవర్లకు కేవలం 162 పరుగులకే కుప్పకూల్చింది. భారత బౌలర్లు కేదార్‌ జాదవ్‌ (3/23), భువనేశ్వర్‌ కుమార్‌ (3/15), జస్ర్పీత్‌ బుమ్రా (2/23) పాక్‌ నడ్డి విరిచారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆదిలోనే దెబ్బతీశాడు. 2 పరుగుల వద్ద ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (2; 7 బంతుల్లో)ను పెవిలియన్‌ పంపించాడు.

అనంతరం బరిలోకి దిగిన బాబర్ , షోయబ్ లు సమయోచితంగా ఆడుతూ 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ తరుణంలో జట్టు స్కోరు 85 పరుగులు ఉన్నప్పుడు బాబర్ ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో… పాక్ పతనం ప్రారంభమైంది. 96 పరుగుల వద్ద షోయబ్ మాలిక్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ (6), ఆసిఫ్ అలీ (9), షాదాబ్ ఖాన్ (8), ఫహీమ్ అష్రఫ్ (21), హసన్ అలీ (1), ఉస్మాన్ ఖాన్ (డకౌట్)లు వచ్చినవాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. 18 పరుగులతో మొహమ్మద్ ఆమిర్ నాటౌట్ గా నిలిచాడు.