భారత్‌ లెక్కసరిచేసింది..

టీమ్ ఇండియా సెకండ్ వన్డే గెలుస్తుందా..లేదా అనే ఉత్కంఠ తెరదించారు మహేంద్రసింగ్ ధోని..కోహ్లీ . నువ్వా నేనా అనేంతగా సాగిన ఆస్ట్రేలియా తో రెండో వన్డే మ్యాచ్ లో భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 299/4తో ఛేదించింది. అడిలైడ్ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 104 రన్స్ తో , మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 55 రన్స్ తో నాట్ అవుట్ నిలిచి భారత్ ను గెలిపించారు.

ఆస్ట్రేలియా టీం నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే 299/4తో ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడినా, పరుగులు రాబట్టడంలో బ్యాట్స్‌మెన్‌ చివరి వరకూ పోరాడి విజయం సాధించారు. దీంతో సిరీస్ 1-1తో సమమవగా విజేత నిర్ణయాత్మక మూడో వన్డే శుక్రవారం ఉదయం 7.50 గంటల నుంచి జరగనుంది.