ఐపీఎల్ వేలం.. కోట్ల వీరులు వీరే


ఐపీఎల్ లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ మరోసారి కోట్ల రూపాయల గేమ్ గా నిలిచింది. యువ ఆటగాళ్ల కొనుగోలుకు ప్రాంచైజ్ లు పోటీలు పడ్డాయి. కోట్ల రూపాయలకు వేలంపాటలో ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి.

తమిళనాడు కుర్రాడు వరుణ్‌ చక్రవర్తి జాక్‌పాట్‌ కొట్టేశాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో మధురై తరఫున ఆడిన ఈ మిస్టరీ స్పిన్నర్‌ కోసం ఫ్రాంచైజీలు ఊహించని విధంగా పోటీపడ్డాయి. చివరికి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.8.40 కోట్లతో అతడిని దక్కించుకుంది.

అలాగే ముంబయి బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే మంచి ధర పలికాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.5 కోట్లతో జట్టులోకి తీసుకొంది. మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, కార్లోస్ బ్రాత్ వైట్ లు ఐదుకోట్ల రూపాయల చొప్పున పలికారు. తెలుగు కుర్రాడు హనుమ విహారిని రెండుకోట్ల రూపాయల మొత్తంతో ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది.