పాపం : బౌలింగ్‌ చేస్తే రక్తం కక్కుకుంటున్నాడట

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జాన్‌ హేస్టింగ్స్‌ అంతుచిక్కని వ్యాధితో బాథపడుతున్నాడు. ఆయన బౌలింగ్‌ చేసిన ప్రతిసారి రక్తం కక్కుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జాన్‌ హేస్టింగ్స్‌ తెలిపారు. ‘బౌలింగ్‌ చేసిన ప్రతిసారీ రక్తం వాంతి చేసుకుంటున్నా. కేవలం బౌలింగ్‌ చేస్తేనే.. పరిగెత్తితే కాదు. నేను బాక్సింగ్‌, రోయింగ్‌ చేయగలను. బరువులూ ఎత్తగలను. కానీ కేవలం బౌలింగ్‌ చేసినప్పుడే అలా జరుగుతోంది’ అని తెలిపాడు హేస్టింగ్స్‌.

ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల బౌలింగ్‌ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతులు అవుతుండడంతో భవిష్యత్తుపై హేస్టింగ్స్‌ ఆందోళన చెందుతున్నాడు. ఈ వ్యాధి కచ్చితంగా తగ్గుతుందని వైద్యులు గ్యారెంటీ ఇవ్వకపోవడం హేస్టింగ్స్‌ ని ఆందోళనకి గురి చేస్తోంది. ఇక, 32 ఏళ్ల హేస్టింగ్స్‌ ఆస్ట్రేలియా తరపున ఓ టెస్టు, 9 టీ20లు, 29 వన్డేలు ఆడారు.