కోహ్లి క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా..?

టీం ఇండియా రధసారధి కోహ్లి ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా..ఇప్పుడు ఇదే చర్చ మొదలు అయ్యింది. తాజాగా కోహ్లీ కూడా తన భార్య అనుష్క శర్మ మాదిరిగా వెండితెరపై అభిమానులను సొంతం చేసుకోవాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. తాజాగా విరాట్ చేసిన ట్వీట్ ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఏదో మూవీ పోస్టర్‌లాగా ఉన్న ఆ ఫొటోలో కోహ్లి పవర్ ఫుల్ హీరోలా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో తెగ చక్కలు కొడుతూ హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఏషియకప్‌కు దూరంగా ఉన్న విరాట్.. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ పోస్టర్‌పై ఇంట్రడ్యూసింగ్ విరాట్ కోహ్లి.. ట్రైలర్ ద మూవీ అని రాసి ఉండటం విశేషం. ఇక ఈ ఫొటోని షేర్ చేస్తూ పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను అని కోహ్లి కామెంట్ చేశాడు. మరి నిజంగానే కోహ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడా..అనేది క్లారిటీ గా తెలియాల్సి ఉంది.