అనుష్క.. టీమిండియా వైస్‌ కెప్టెనా ?

నటి అనుష్క శర్మ టీమిండియా వైస్‌ కెప్టెనా ? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. తాజాగా బీసీసీఐ ఓ ఫొటోను పంచుకోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తొలి టెస్ట్ ముగిసింది. రెండో టెస్టు మధ్య వచ్చిన గ్యాప్ లో.. ఆటగాళ్లు ప్రత్యేక ఆహ్వానం మేరకు లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌తో కలిసి అనుష్క కూడా వెళ్లింది. కార్యాలయం ఎదుట అందరూ కలిసి దిగిన ఫొటోను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ఈ ఫొటోలు అనుష్కను చూసి అభిమానులు మండిపడ్డారు.

‘అనుష్క టీమిండియాలో సభ్యురాలా? అనుష్క శర్మ టీమిండియాతో కలిసి ఎందుకు ఉంది? ఇది క్రికెట్‌ టూరా? లేక హనీమూన్‌ టూరా? ఇదేమీ ఫ్యామిలీ ఫంక్షన్‌ కాదు! టీమిండియాకు అనుష్క శర్మ ఎప్పుడు ఎంపిక అయ్యింది? ఇంతకీ ఆమె టీమిండియాకు బౌలర్‌.. బ్యాటర్‌.. కోచ్‌.. ఏ విధంగా సేవలు అందిస్తోంది? ఆమె ఏమైనా టీమిండియా వైస్‌ కెప్టెనా’ అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.