పంత్ ప్రేమలో పడ్డాడు

భారత వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ ప్రేమలో పడ్డాడు. ఇటీవల పంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయితో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘నా సంతోషానికి కారణం నువ్వే.. నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా’ అని కామెంట్‌ పెట్టాడు. ఆమె కూడా అదే ఫొటోను షేర్‌ చేసింది. ‘మై మ్యాన్‌, మై సోల్‌మేట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌, లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అంటూ ఆమె క్యాప్షన్‌ ఇచ్చింది. అన్నట్టు.. పంత్‌ షేర్‌ చేసిన ఫొటోలోని అమ్మాయి పేరు ఇషా నేగి. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌.

కాగా ఆస్ట్రేలియా గడ్డపై శతకం నమోదు చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్‌ అనంతరం ఆసీస్‌, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి లభించిన నేపథ్యంలో ఖాళీ సమయాన్ని ఇలా రొమాంటిక్ గా గడుపుతున్నాడు పంత్.