సిరిస్ మనదేరా..

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కైవశం చేసుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా మళ్లీ మూడు రోజుల్లోనే విజయ దుందుభి మోగించింది. రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు నిర్దేశించిన 71 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లు 16.1 ఓవర్లలోనే ఛేదించారు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌( 33 నాటౌట్‌), పృథ్వీ షా(33 నాటౌట్‌)లు వికెట్‌ పడకుండా ఆడి టీమిండియాకు ఘన విజయాన్ని అందించారు. రెండో టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన విరాట్‌ గ్యాంగ్‌ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సత్తాచాటిన ఉమేశ్‌ యాదవ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం చెలరేగి బౌలింగ్‌ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను సాధించాడు. దాంతో మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకుని తన టెస్టు కెరీర్‌లో తొలిసారి ఆ ఘనతను లిఖించుకున్నాడు. పృద్వీ షాకు మ్యాన్ అఫ్ ది సిరిస్ అవార్డ్ దక్కింది.