ఆసీస్ టూర్ : ఫస్ట్ ఇన్నింగ్ లో భారత్ ఆధిక్యం

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 15 ప‌రుగుల ఆధిక్యాన్ని సాధించింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 235 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 191/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో 88.1 ఓవర్ల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ కేవలం 44 పరుగులు మాత్రమే జోడించింది. ప్రస్తుతం టీమిండియా 15 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మూడో రోజు ఆటలో భాగంగా తొలి వికెట్‌ మిచెల్‌ స్టార్క్‌(15) బుమ్రాకు చిక్కగా, చివరి రెండు వికెట్లు షమీ ఖాతాలో పడ్డాయి. ఆసీస్‌ బ్యాట్సమెన్‌లో హెడ్‌ (72), హ్యాండ్స్‌ కాంబ్‌ (34), కవాజా (28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్‌, బుమ్రా మూడేసి, ఇషాంత్‌, షమి రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌ 250 పరుగులకు ఆలౌటైంది.