అతి త్వరలో ఆచార్య టీజర్ ..

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ వీరిద్దరి కలయికలో ఆచార్య మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. దేవాలయ శాఖ కుంభకోణాలు రాజకీయాల నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్ కి గురి చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది.

కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కోసం మెగా అభిమానులతో పాటు సినీప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులు అతి త్వరలో తెరపడనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మెగా టీజర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అది కూడా ఈ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తారని వినికిడి. మరి నిజంగానే ఈ టీజర్ వస్తుందా లేదా అన్నది ఎదురు చూడాల్సిందే.