గాల్లో ఎగిరే ఉబర్ ట్యాక్సీలు..

ఇప్పటివరకు రోడ్ల ఫై తిరిగే టాక్సీ లను మాత్రమే మనం చూసాం..కానీ ఇప్పుడు గాల్లో ఎగిరే ట్యాక్సీలు రాబోతున్నాయి. హెలికాప్టర్ మాదిరిగా ఉన్న ఈ కార్లో నలుగురు ప్రయాణం చేయచ్చు. నార్త్‌ స్టార్‌ అనే కంపెనీతో కలసి ఉబర్‌ ఈ కారును డిజైన్‌ చేసింది.

రీసెంట్ గా అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన ఉబర్‌ ఎలివేట్‌ సమ్మిట్‌–2019లో ఈ కారును ప్రదర్శనకు ఉంచింది. అయితే 2020లో తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెడతామని, 2023 వరకు ఎయిర్‌ ట్యాక్సీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనుంది. మరి ఇండియా సంగతి ఏంటి అనేది తెలియాల్సి ఉంది.