అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో అతి తక్కువ ధరలో వచ్చే స్మార్ట్ ఫోన్లు ఇవే…

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడూలాగానే ఈ ఏడూ కూడా ప్రైమ్‌ డే సేల్‌ ను సోమవారం తీసుకొచ్చింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల మొదలైన ఈ సేల్ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఈ ప్రైమ్‌డే సేల్‌ లో భాగంగా వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. అయితే ఈ సేల్ లో అతి తక్కువ ధరలలో వచ్చే స్మార్ట్ ఫోన్ల వివరాలను మీకు మీము తెలియజేస్తున్నాం.

* శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ 2 – రూ.12,990కు తగ్గింపు
* హానర్‌ 7ఎక్స్‌(64జీబీ) – రూ.13,999కు లభ్యం
* జియోని ఎం7 పవర్‌ – రూ.18,279 నుంచి రూ.10,999కు తగ్గింపు
* శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌8 – రూ.9,990(అసలు ధర రూ.13,490)
* నోకియా 5(16జీబీ) – రూ.11,599 (అసలు ధర రూ.15,299)
* ఎల్‌జీ క్యూ6ప్లస్‌ – రూ.19,990 నుంచి రూ.12,990కు తగ్గింపు
* శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌(64జీబీ) – రూ.11,990కు తగ్గింపు
* ఒప్పో ఏ57(32జీబీ) – రూ.11,990(అసలు ధర రూ.14,990)
* ఆసుస్‌ జెన్‌ఫోన్‌4 సెల్ఫీ – రూ.7,999(అసలు ధర రూ.10,999)
* కార్బన్‌ ఫ్రేమ్స్‌ ఎస్‌9 – రూ.5,899(రూ.8,999)
* రెడ్‌మి వై2 స్మార్ట్‌ఫోన్‌ 32 జీబీ వేరియంట్‌ కూడా రూ.9999కు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి
విక్రయానికి వచ్చింది.
* హానర్‌ 7సీ రూ.9499
* మోటో ఈ5 ప్లస్‌ రూ.11,999
* మోటో జీ5ఎస్‌ ప్లస్‌ 64జీబీ వేరియంట్‌పై 29 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది.

మొబైల్‌ ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు, పవర్‌ బ్యాంక్‌లు, స్క్రీన్‌ ప్రొటెక్టర్లు, కేసెస్‌, కవర్స్‌, డేటా కేబుల్స్‌ వంటి మొబైల్‌ యాక్ససరీస్‌పై సుమారు 80 శాతం డిస్కౌంట్లను అమెజాన్‌ అందిస్తోంది. ముఖ్య విషయం అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్నవారికి మాత్రమే అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌లో వస్తువులు కొనే అవకాశం లభిస్తుంది.