ఫ్లిప్‌కార్ట్‌లో దివాలీ ఆఫర్లు ఎలా ఉన్నాయో చూస్తారా..?

మరో రెండు వారాల్లో దివాలీ రాబోతుంది..ఈ సందర్భంగా అన్ని సంస్థలు దివాలీ ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రముఖ ఆన్లైన్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దివాలీ సేల్‌ పేరిట ప్రత్యేక ఆఫర్లు మొదలు పెట్టబోతోంది. ఈరోజు (అక్టోబర్‌ 12,శనివారం) నుంచి ఈ సేల్ మొదలు పెట్టింది.

వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు, వివిధ గృహోపకరణాలు, టీవీలు, దుస్తులు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ఆఫర్‌ చే​స్తోంది. అక్టోబర్‌ 16 వరకు ఈ నిర్వహించనున్న ఈ విక్రయాల్లో లెనోవో, రెడ్‌మి, రియల్‌మి, ఒప్పో, గూగుల్‌, ఐఫోన్‌ తదితర స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను ప్రకటించింది.

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు చూస్తే..

* శాంసంగ్‌ ఎస్‌ 9 (4జీబీ, 64 జీబీ): అసలు ధర రూ. 62,500 రూ. ఆఫర్‌ ప్రైస్‌ రూ. 29,999
* రెడ్‌మి 8 : రూ .7999 కే అందిస్తోంది.
* రెడ్‌మి 8 ఏ అసలు ధర రూ.7990 ఆఫర్‌ ప్రైస్‌ రూ. 6499
* ఐఫోన్‌ 7 : అసలు ధర రూ.29,990 , ఆఫర్‌ ప్రైస్‌ రూ. 26,999
* లెనోవా కె10నోట్‌ : అసలు ధర రూ. రూ.16999, ఆఫర్‌ ప్రైస్‌ 10999.