భారత మార్కెట్లోకి హానర్ 8సి..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువావే నుండి హానర్ 8సి స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత మార్కెట్లోకి విడుదల అయ్యింది. అక్టోబర్ నెలలో చైనా మార్కెట్‌లో విడుదల అయినా ఈ మొబైల్ , ఇప్పుడు భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ లో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే తో పాటు వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు , ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేయడం విశేషం.

హానర్ 8సి స్మార్ట్‌ఫోన్ అరోరా బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియెంట్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.11,999 ధరకు, 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.12,999 ధరకు విక్రయిస్తున్నారు.

హానర్ 8సి ఫీచర్లు చూస్తే..

* 6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.