హానర్ ఎంజాయ్ మ్యాక్స్ విడుదల..

హానర్ ఎంజాయ్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్‌లో విడుదల అయ్యింది. త్వరలో భారత్ లో విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.15,980 ధరకు లభ్యం కానుండగా, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.18,115 ధరకు లభ్యం కానుంది. ఈ ఫోన్ లో 7.12 ఇంచుల భారీ డిస్‌ప్లేను అమర్చడం విశేషం.

హానర్ ఎంజాయ్ మ్యాక్స్ మరిన్ని ఫీచర్లు చూస్తే..

* 7.12 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ సెల్పీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.