హువావే నుండి సరికొత్త మోడల్..

ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త మోడల్స్ ను పరిచయం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్న హువావే ..తాజాగా చైనా మార్కెట్‌లో ఎంజాయ్ 9 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ లో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే తో పాటు వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చడం విశేషం.

మిడ్‌నైట్ బ్లాక్, అరోరా బ్లూ, కోరల్ రెడ్, అరోరా వయొలెట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదల కాగా దీనికి చెందిన 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.10,470 ధరకు ఈ నెల 17వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

హువావే ఎంజాయ్ 9 ఫీచర్లు చూస్తే..

* 6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
* 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్
* 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.