మార్కెట్లోకి హువావే నోవా 3ఐ..ఫీచర్స్ ఫై లుక్ వెయ్యండి

ప్రముఖ మొబైల్ సంస్థ హువావే తాజాగా భారత మార్కెట్లోకి నోవా 3ఐ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.20,400, రూ.22,440 ధరలకు వినియోగదారులకు ఆగస్టు 8వ తేదీ నుంచి లభ్యం కాబోతున్నట్లు సంస్థ తెలిపింది.

హువావే నోవా 3ఐ ఫీచర్లు చూస్తే..

* 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.