జియో కొత్త ప్లాన్స్ వివరాలు చూసారా..?

అన్ని ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగు పెడుతూనే సరికొత్త సంచలనం సృష్టించిన జియో.. ఇప్పుడు కస్టమర్లపై భారం వేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఇతర నెట్‌వర్క్ కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయడం స్టార్ట్ చేసిన జియో.. ఇక ఈ నెల 6వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమలు చేస్తుంది. ఇప్పటికే మిగతా టెలికం సంస్థలు ఛార్జ్ లు పెంచగా.. రేపటి నుండి జియో కొత్త ప్లాన్స్ అమలు చేస్తుంది. న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ పేరుతో కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది.

ఈ ప్లాన్స్‌లో వరుసగా నెల, రెండు నెలలు, మూడు నెలలు, 12 నెలలకు గాను రూ.199, రూ.399, రూ.555, రూ.2,199 ప్లాన్స్ తెచ్చిన జియో.. తన నెట్‌వర్క్‌లోని కాల్స్‌కు అపరిమిత ఉచిత కాల్స్ అందిస్తుంది. ఇక, ఈ ప్లాన్స్‌లో నెల ప్యాకేజీకి 1000 నిమిషాలు, 2 నెలల ప్లాన్‌కు 2 వేల నిమిషాలు, 3 నెలల ప్లాన్‌కు 3 వేల నిమిషాలు, 12 నెలల ప్లాన్‌కు 12 వేల నిమిషాలు ఇతర నెట్‌వర్క్ కాల్స్‌కు అందిస్తోంది. మిగతా డిటైల్స్ ఈ కింది పట్టిక లో చూడండి.