లావా నుండి బడ్జెట్ ఫోన్..

ప్రముఖ మొబైల్ సంస్థ లావా..తాజాగా వినియోగదారులకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఫోన్ ను తీసుకరాబోతుంది. లావా జెడ్66 పేరిట ఈ ఫోన్ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఇందులో 3 జీబీ ర్యామ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు సమాచారం.

అయితే లావా మనదేశంలో త్వరలో ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని లావా ప్రెసిడెంట్ సునీల్ రైనా తెలిపారు. ఈ లాక్ డౌన్ ముగిశాక వీటిని లాంచ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.