లెనోవో నుంచి ఎస్5 ప్రొ స్మార్ట్‌ఫోన్..

ఇప్పటికే పలు ఫీచర్ ఫోన్లను అందించిన లెనోవో..తాజాగా మార్కెట్లోకి సరికొత్త మోడల్ ను తీసుకరాబోతుంది. ‘ఎస్5 ప్రొ’న పేరుతో అక్టోబరు 18న ఈ ఫోన్ విడుదల చేయనుంది. 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్లు రానున్నాయి. బ్లాక్, రెడ్, గోల్డ్, సిల్వర్, వైట్ కలర్ వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది.ఇక దీని ధర ఇంకా తెలుపనప్పటికీ , ఫీచర్లు మాత్రం బయటకు వచ్చి ఆకట్టుకుంటున్నాయి.

లెనోవో ఎస్5 ప్రొ ఫీచర్లు చూస్తే..

* 6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 3/4/6 జీబీ ర్యామ్
* 32/64 జీబీ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్,
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* 20+12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20+8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* 3500 ఎంఏహెచ్ బ్యాటరీ