మార్కెట్లోకి ‘ఎంఐ మిక్స్3’ ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా..?


ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోమీ తాజాగా ‘ఎంఐ మిక్స్3’ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఆనిక్స్ బ్లాక్, జేడ్ గ్రీన్, సఫైర్ బ్లూ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదలైంది. 6జీబీ ర్యామ్.. 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.34,800లుగా, 8 జీబీ ర్యామ్.. 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.37,965 లుగా , 8జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.42,185 లుగా నిర్ణయించింది. ఇక 10 జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.52,770 లుగా ప్రకటించింది. ఈ ఫోన్ నవంబర్ 1వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రాబోతుంది.

వీటి ఫీచర్లు చూస్తే…

* 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* 6/8/10 జీబీ ర్యామ్.. 128/256 జీబీ స్టోరేజ్
* 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 3850 ఎంఏహెచ్ బ్యాటరీ