హువావే ఎంజాయ్ 10 ..ఫీచర్లు చూస్తే ఎంజాయ్ చేయాల్సిందే..

సరికొత్త మోడల్స్ తో తక్కువ ధరలలో ఫోన్లను అందించే హువావే..తాజాగా హువావే ఎంజాయ్ 10 పేరిట సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. చైనాలో ఈ ఫోన్ ను అధికారికంగా విడుదల చేసారు. ఇందులో 48 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా, పంచ్ హోల్ సెల్పీ కెమెరాతో కూడిన డిస్ ప్లే ఉండటం విశేషం.

ఇక ఈ ఫోన్ ధరల విషయానికి వస్తే..ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లు(సుమారు రూ.12,000)గా ఉండగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ల ధరను 1,399 యువాన్లు(సుమారు రూ.14,000)గా నిర్ణయించారు.

ఫీచర్లు చుస్తే..

* ఇందులో 6.39 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
* స్క్రీన్ టు బాడీ రేషియో 90.15 శాతం
* స్క్రీన్ రిజల్యూషన్ 720×1560 పిక్సెల్స్
* ఆక్టాకోర్ హై సిలికాన్ కిరిన్ 710ఎఫ్ ప్రాసెసర్
* మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా ఫోన్ స్టోరేజ్ ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
* ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.