కేవలం రూ.1,149 లకే నోకియా 6.1 ప్లస్ ఫోన్..

రూ.1,149 లకే నోకియా 6.1 ప్లస్ ఫోన్ రావడం ఏంటి అనుకుంటున్నారా..నమ్మలేకపోతున్నారా….మీము చెపుతుంది నిజమండి..రెండు నెలల క్రితం హెచ్ఎండీ గ్లోబల్ ఇండియాలో నోకియా 6.1 ప్లస్ ను ధర రూ.15,999 విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ కేవలం రూ.1,149 లకే ప్లిప్‌కార్ట్‌ అందిస్తుంది. అది ఎలాగో మీరే చూడండి.

నోకియా 6.1 ప్లస్ అసలు ధర రూ.15,999 కాగా… దివాళీ సేల్ ఆఫర్‌లో రూ.1,000 తగ్గింపుతో రూ.14,999 ధరకే లభిస్తోంది. దాంతో పాటు ఎస్‌బీఐ కార్డు ఉంటే మరో 10% డిస్కౌంట్ లభిస్తుంది.అంతే కాకుండా మీ పాత ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ గరిష్టంగా రూ.13,850 ఎక్స్‌ఛేంజ్ ఇస్తోంది. డిస్కౌంట్ ఎంత అన్నది మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.13,850 డిస్కౌంట్ వచ్చిందంటే… నోకియా 6.1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ మీకు రూ.1,149 ధరకే సొంతం అవుతుందన్న మాట.

ఇక నోకియా 6.1 ప్లస్‌ ఫీచర్స్ చూస్తే..

* 5.8 అంగుళాలు, ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
* 19:9 యాస్పెక్ట్ రేషియో, 2280×1080 పిక్సెల్స్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
* 16+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 3,060 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
* డ్యూయెల్ సిమ్ సిమ్ సపోర్ట్
* మిడ్‌నైట్ బ్లూ, బ్లాక్, వైట్ కలర్స్.