ఇండియన్ మార్కెట్ లోకి నోకియా 6.2

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల రంగంలో దూసుకుపోయిన నోకియా ఇప్పుడు పునర్వైభవం కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తుంది. గత నెలలోనే నోకియా 7.2ను లాంచ్ చేసిన నోకియా తాజాగా శుక్రవారం భారత మార్కెట్లోకి నోకియా 6.2ను లాంచ్ చేసింది.

4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 15,999గా సంస్థ నిర్ణయించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నోకియా.కామ్ వెబ్ సైట్లలో ఇప్పటికే ఈ మోడల్ అందుబాటులో ఉంది. సెరామిక్ బ్లాక్ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో ఉందని.. ఐస్ కలర్ వేరియంట్ ను త్వరలో స్టోర్లలో అందుబాటులోకి తీసుకొస్తామని హెచ్ ఎండీ గ్లోబ తెలిపింది.