నోకియా 7.1 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు చూసారా..?

భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్ ను తీసుకొచ్చింది హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా. ‘నోకియా 7.1’ పేరిట ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే వీడియో క్రియేటింగ్‌, కంటెంట్‌ వాచింగ్‌ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించి 3జీబీ, 32 స్టోరేజీ వేరియంట్‌ను ఇప్పటికే లండన్‌లో విడుదల చేయగా.. భారత్‌లో మాత్రం 4జీబీ, 64 జీబీ వేరియంట్‌ను మాత్రమే విడుదల చేసారు.

గ్లోస్ మిడ్‌నైట్ బ్లూ, గ్లోస్ స్టీల్ కలర్ వేరియెంట్లలో రూ.19,999 ధరకు వినియోగదారులకు ఈ ఫోన్ డిసెంబర్ 7 నుంచి లభ్యం కానుంది.

నోకియా 7.1 ఫీచర్లు చూస్తే..

* 5.84 అంగుళాల తెర
* 1080 x 2280 పిక్సల్స్‌ స్క్రీన్ రిజల్యూషన్
* ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1 ఓఎస్‌, 9.0 వెర్షన్‌ అప్‌డేటెడ్ వెర్షన్.
* 1.8 గిగాహెర్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* వెనుకవైపు 12+5 మెగాపిక్సల్స్‌ డ్యుయల్‌ కెమెరా
* ముందువైపు 8 మెగా పిక్సల్‌ కెమెరా
* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నెల్‌ స్టోరెజ్‌, 400 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్.
* 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ – సి
* ఫాస్ట్ చార్జింగ్. 30 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్