మార్కెట్లోకి బనానా ఫోన్..ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి…

మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్స్ వస్తూ..వినియోగదారులను తెగ ఆకట్టుకుంటున్న సంగతి తెల్సిందే. తాజాగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ సరికొత్త బనానా స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. ‘నోకియా 8110 4జీ బనానా ఫోన్’ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. అరటిపండు ఆకృతిలో వంపు కలిగి ఉండడం ఈ ఫోన్ ప్రత్యేకత.

జియో ఫోన్‌లో ఉపయోగించే ‘కై’ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసేలా ఈ ఫోన్‌ను తయారు చేసారు. ఈ 4జీ ఫీచర్‌ స్మార్ట్‌ఫోన్‌లో గతంలో ఆదరణ పొందిన కీప్యాడ్‌ స్లైడర్‌ విధానాన్ని చేర్చారు. ఇక ఈ ఫోన్ ధర రూ.5,999గా సంస్థ నిర్ణయించింది. అన్ని 4 జీ మొబైల్స్ లో మాదిరిగానే ఈ ఫోన్ లో కూడా వాట్సాప్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌తోపాటు అన్ని రకాల గూగుల్‌ యాప్స్‌ ఉపయోగించుకునేలా రూపొందించారు. అక్టోబరు 24 నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..

* డిస్‌ప్లే: 2.45 అంగుళాల కర్వ్‌డ్‌ డిస్‌ప్లే
* రిజల్యూషన్: 240 x 320 పిక్సెల్స్.
* ఆపరేటింగ్ సిస్టం: కై
* ప్రాసెసర్: 1.1 గిగా హెట్జ్ డ్యూయల్ కోర్
* కెమెరా: 2 మెగా పిక్సల్‌ బ్యాక్ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్‌.
* ర్యామ్: 512 ఎంబీ
* స్టోరేజ్: 4 జీబీ
* డ్యుయల్‌ సిమ్‌ (మైక్రో+నానో)
* 4జీ ఓల్ట్‌, హాట్‌స్పాట్‌, వైఫై.
* 1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ .