మార్కెట్ లోకి ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో ..

ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ అందిస్తూ వినియోగదారులను కట్టిపడేసే ఒప్పో..తాజాగా ఫైండ్ ఎక్స్ 2 నియో పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. క్వాడ్‌ కెమెరా, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండడం విశేషం. ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ 2 సిరీస్‌లో ఇది నాలుగోది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లైట్ ఫోన్లు ఇప్పటికే లాంచ్‌ అయ్యాయి. ఈ కొత్త ఫోన్‌ ధరను రూ.58,000గా కంపెనీ నిర్ణయించింది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో ఫీచర్లు

* 6.5 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
* 2400 x 1080 రిజల్యూషన్
* ఆండ్రాయిడ్ 10-బేస్డ్ కలర్ ఓఎస్ 7
* క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 765జీ సాక్‌
* 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
* వెనుకవైపు నాలుగు కెమెరాలు..
* 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
* 13 మెగాపిక్సెల్ టెలీఫొటో కెమెరా
* 8 మెగాపిక్సెల్ వైడ్‌ యాంగిల్‌ షూటర్‌
* 2 మెగాపిక్సెల్ షూటర్‌
* 32 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
* 4025 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం