మార్కెట్లోకి ఒప్పో ఆర్17..

ఇప్పటికే ఆకట్టుకునే ఫీచర్లతో రకరకాల మోడల్స్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఒప్పో..తాజాగా ఒప్పో ఆర్17 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా బయటకు తెలుపనప్పటికీ , దీని ఫీచర్లు మాత్రం బయటకొచ్చి మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

ఒప్పో ఆర్17 ఫీచర్లు చూస్తే..

* 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్
* 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జ్.