ఒప్పో ‘ఆర్17 ప్రొ’ విడుదల తేదీ..

సరికొత్త మోడల్స్ ను ఎప్పటికప్పుడు భారత మార్కెట్ లోకి విడుదల చేస్తున్న ఒప్పో తాజాగా తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ఆర్17 ప్రొ’ను డిసెంబర్ 4న విడుదల చేయబోతుంది. డిసెంబరు 1నుంచి ఈ ఫోన్‌కు సంబంధించి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ ఫోన్‌ను గత ఆగస్టులోనే చైనా మార్కెట్‌లో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఫోన్ లో 6.4 అంగుళాల భారీ తెరతో పాటు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తుండడం విశేషం. మరిన్నో ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఒప్పో ఆర్17 ప్రొ ఫీచర్లు :-

* 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

* 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

* గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

* 8 జీబీ ర్యామ్

* 128 జీబీ స్టోరేజ్

* డ్యుయల్ సిమ్

* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

* 12 + 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

* డ్యుయల్ బ్యాండ్ వైఫై

* బ్లూటూత్ 5.0

* యూఎస్‌బీ టైప్ సి

* 3700 ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్).