ఈ నెల చివర్లో రియల్‌ మి 2 ప్రొ వచ్చేస్తుంది..

భారత మొబైల్ మార్కెట్ లో ఇతర సంస్థల హడావిడి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తన ఉనికిని చాటుకునేందుకు రియల్‌ మి కసరత్తలు చేస్తుంది. ఇప్పటికే భారత మార్కెట్లో రియల్‌ మి 1, రియల్‌ మి2 రెండు వేరియంట్ల స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసి ఆకట్టుకోగా , తాజాగా రియల్‌ మి 2 ప్రొ పేరిట సరికొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది. సెప్టెంబరు 27న నిర్వహించనున్న ఈవెంట్‌లో ‘రియల్‌ మి2 ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. దీని ధర వివరాలు త్వరలో తెలియజేస్తుండగా ప్రస్తుతం దీని ఫీచర్లు మాత్రం బయటకొచ్చాయి.

ఫీచర్లు చూస్తే..

* 6.20 ఇంచ్ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
* 720×1520 స్క్రీన్ రిసల్యూషన్
* 1.8 గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* 3జీబీ ర్యామ్‌.. 32 జీబీ స్టోరేజ్‌
* 13+2 ఎంపీ డ్యుయల్‌ బ్యాక్ కెమెరాలు
* 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
* 4230ఎంఎహెచ్‌ బ్యాటరీ