రెడ్‌మి నోట్ 7 కోసం పోటీ పడుతున్నారు..

భారత మార్కెట్ లో రెడ్‌మి మొబైళ్ల హావ మాములుగా లేదు..ఈ సంస్థ నుండి ఏ మోడల్ బయటకొచ్చిన కస్టమర్లు పోటీపడుతున్నారు. తక్కువ ధర లో అత్యధిక ఫీచర్లు అందిస్తుండడం తో వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సదరు సంస్థ కూడా సరికొత్త వేరియంట్లలో నెలకో మోడల్ తీసుకొస్తూ ఆకట్టుకుంది.

తాజాగా గత నెలలో చైనాలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 7 ను హాట్ కేకుల్లా కొనుగోలు చేస్తున్నారు. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి మూడు వారాల్లోనే 10 లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించాయని కంపెనీ తెలిపింది. ఈ లెక్కన వాటిని ఏ రేంజ్ లో కొనుగోలు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అతిత్వరలో భారత్‌ మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. భారత్ లో ఏ రేంజ్ లో సేల్ అవుతాయో చూడాలి.

రెడ్‌మి నోట్ 7 ఫోన్‌ ఫీచర్స్ చూస్తే..

* 6.3 అంగుళాల స్క్రీన్
* 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 3 జీబీ, 4 జీబీ, 6 జీబీ ర్యామ్ ఆప్షన్లతో 32 జీబీ, 64 జీబీ మెమరీ వేరియంట్లలో కస్టమర్లకు లభ్యమౌతోంది.
* 48 ఎంపీ+ 5 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా
* 13 ఎంపీ ఏఐ ఫ్రంట్ కెమెరా
* క్వాల్‌కామ్ లేటెస్ట్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయిన స్నాప్‌డ్రాగన్ 660 .