సోనీ ఎక్స్‌పీరియా నుండి రెండు సరికొత్త మోడల్స్..

ప్రముఖ మోడల్ సంస్థ సోనీ ఇప్పటికే పలు రకాల మోడల్స్ తీసుకురాగా , తాజాగా తన ఎక్స్‌పీరియా సిరీస్ నుండి మరో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతుంది. ఎక్స్‌పీరియా 10, 10 ప్ల‌స్ పేరిట ఈ ఫోన్లు అందుబాటులోకి రాబోతున్నాయి.

ఇక వీటి ధర విషయానికి వస్తే ఎక్స్‌పీరియా 10 ఫోన్ రూ.27,925 ప్రారంభ ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, ఎక్స్‌పీరియా 10 ప్ల‌స్ ఫోన్ రూ.34,330 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. వీటి ఫీచర్లు చూస్తే..

సోనీ ఎక్స్‌పీరియా 10 :

* 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
* 2560 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 630 ప్రాసెస‌ర్‌
* 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
* 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
* 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 2870 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0, అడాప్టివ్ చార్జింగ్‌.

సోనీ ఎక్స్‌పీరియా 10 ప్ల‌స్ ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
* 2560 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌
* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
* 12, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
* 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
* 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ
* యూఎస్‌బీ టైప్ సి, క్విక్ చార్జ్ 3.0, అడాప్టివ్ చార్జింగ్‌.