వివో నుండి నెక్స్ డ్యుయల్‌ స్మార్ట్ ఫోన్..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తాజాగా నెక్స్ డ్యుయల్‌ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్లో రెండు డిస్‌ప్లేలు కలిగి ఉండడం విశేషం.

6.39 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఒక వైపు, 5.49 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే మరో వైపు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 10 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసింది. రూ.52,080 ధరకు వినియోగదారులకు లభ్యం కానున్న ఈ ఫోన్ ఐస్ బ్లూ, స్టార్ పర్పుల్ కలర్ వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది.

వివో నెక్స్ డ్యుయల్ డిస్‌ప్లే ఫోన్ ఫీచర్లు చూస్తే..

* 6.39 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 5.49 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
* 10 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై
* 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి
* 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.