అతి త్వరలో వివో ‘ఎస్1’..

ఇప్పటికే మొబైల్ మార్కెట్లో రకరకాల మోడల్స్ ను తీసుకొచ్చిన వివో..తాజాగా సరికొత్త స్మార్ట్ ఫోన్ ‘ఎస్1’ను తీసుకువచ్చేందుకు సిద్దమవుతుంది. మార్చి 19న ఎక్స్27 ఫోన్‌తోపాటు ఎస్1 ఫోన్‌ను విడుదల చేయనుంది. కాకపోతే దానికంటే ముందే ఈ ఫోన్ తాలుకా వివరాలు లీక్ అయ్యాయి.

లీకైన దాని బట్టి చూస్తే..వివో ఎస్1 ఫోన్ ధర రూ.20,800గా ఉండొచ్చని అంటున్నారు. అలాగే ఫీచర్లు చూస్తే..

* 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్మీ
*డియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ
* ట్రిపుల్ రియర్ కెమెరా (12 ఎంపీ+8 ఎంపీ+5 ఎంపీ)
* ముందు భాగంలో 25 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.