భారత మార్కెట్లోకి వి 17 ..ఫీచర్లు కిరాక్

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో ..తాజాగా భారత మార్కెట్లోకి వి 17 మోడల్ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్లో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉండడం విశేషం. వివో వి17 ఫోన్‌లో వెనుక భాగంలో 48, 8, 2, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాలు నాలుగు ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక ఈఫోన్ ధర రూ.22,990 ఉండగా దీన్ని డిసెంబర్ 10వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే…

* 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే

* స్కాట్ జెన్సేషన్ యూపీ గ్లాస్ ప్రొటెక్షన్‌

*ఈ ఫోన్‌లో 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు.

* మెమొరీని 256జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

* ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.