వివో వై95 స్మార్ట్‌ఫోన్ ధర ఘోరంగా తగ్గుతుంది..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో..నుండి వై95 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన దగ్గరి నుండి దీని ధర తగ్గిస్తూనే ఉంది సంస్థ. ఇప్పటికే రెండు సార్లు ధర తగ్గగా..తాజాగా మరోసారి తగ్గి కస్టమర్లకు ఊరట కలిగించింది.

ముందుగా ఈ ఫోన్ రూ.16,990 ధరతో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మార్చిలో ఈ ఫోన్ ధర రూ.15,990కు తగ్గింది. తర్వాత దీని ధర మళ్లీ రూ.14,990కు వచ్చిచేరింది. ఇప్పుడు తాజాగా మళ్లీ ఈ ఫోన్ ధర మరో రూ.1,000 తగ్గుదలతో రూ.13,990కు వచ్చింది. ఈ తగ్గుదల చూసి మరికొన్ని రోజులు ఎదురుచూస్తే ఇంకాస్త తగ్గుందేమో అని భావిస్తున్నారు.

ఇక దీని ఫీచర్లు చూస్తే..

* 6.22 అంగుళాల స్క్రీన్
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్
* డ్యూయెల్ రియర్ కెమెరా (13 ఎంపీ+2 ఎంపీ), 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
* వాటర్ డ్రాప్ డిస్‌ప్లే, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 4 జీబీ ర్యామ్, 64 జబీ మెమరీ
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో వంటి ప్రత్యేకతలున్నాయి.