వరల్డ్‌ కప్‌ ఆఫర్స్ : భారీగా తగ్గినా టీవీల ధరలు..

వరల్డ్‌ కప్‌ పుణ్యమా..టీవీలు కొనుగోలు చేసేవారికి శుభవార్త..ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ టీవీల ఫై దాదాపు 60 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ‘వరల్డ్ కప్ మానియా’ పేరుతో జూన్ 13వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆఫర్ ఇస్తోంది. నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ ఆఫర్స్‌లో షావోమీ, థామ్సన్, వూ, ఐఫాల్కన్ తదితర కంపెనీల టీవీలు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.

థామ్సన్ స్మార్ట్ టీవీ :

* థామ్సన్ యూడీ 9 40అంగుళాల టీవీ19,999 లకే లభిస్తోంది. అసలు ధర మీద 28శాతం డిస్కౌంట్‌.

* 55 అంగుళాల ప్రీమియం మోడల్ రూ.33,999గా ఉంది.

షావోమీ స్మార్ట్ టీవీలు :

* 32 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4ఏ ప్రొ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,999 గా ఉంది.

* 43 అంగుళాల మోడల్ రూ.22,999కే అందుబాటులో ఉంది.

* 55 అంగుళాల మోడల్ టీవీ రూ.39,999గా ఉంది.

* ఎంఐ టీవీ ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 వరకు ఉన్నాయి.

వూ అల్ట్రా స్మార్ట్ టీవీ :

* వూ స్మార్ట్‌టీవీ 33 శాతం డిస్కౌంట్‌తో రూ.17,999కి వస్తుంది. దీని అసలు ధర రూ.27,000.

* 32 అంగుళాల టీవీ రూ.11,999

* 55 అంగుళాల హెచ్‌డీ టీవీ రూ.36,999

* 65 అంగుళాల మోడల్ టీవీ రూ.1,29,999.

* ఐఫాల్కన్ స్మార్ట్ టీవీలు

* 32 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు లభిస్తాయి.
* 32 అంగుళాల మోడల్ రూ.11,999
* 75 అంగుళాల 4కేయూహెచ్‌డీ ప్రీమియం మోడల్ టీవీ రూ.1,49,999కు అందుబాటులో ఉంది.