2020 లో వాట్సాప్ పనిచేయదు..

టైటిల్ చూసి షాక్ అవుతున్నారా..వాట్సాప్ పనిచేయకపోతే ఎలా..అని అనుకుంటున్నారా..మీరు చదివిన వార్త నిజమే కాకపోతే అన్ని ఫోన్లలో కాదు కేవలం కొన్ని ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మీద నడిచే కొన్ని స్మార్ట్ ఫోన్లలలో వాట్సాప్ నిలిచిపోనున్నట్లు ప్రకటించింది వాట్సాప్ సంస్థ. అలాగే విండోస్ ఫోన్లకు అయితే పూర్తిగా వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది.

ఐవోఎస్ 8 లేదా దాని కంటే పాత ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేసే యాపిల్ ఫోన్లలో కూడా 2020 ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ పనిచేయదు. అప్పటి వరకు మీరు ఈ ఆపరేటింగ్ సిస్టంపై నడిచే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ను ఉపయోగించుకోవచ్చు అని తెలిపింది.

ఆండ్రాయిడ్ Eclair 2.3.7 లేదా దాని కంటే పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మీద నడిచే అన్ని స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఫిబ్రవరి 1, 2020 వరకు మాత్రమే ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేస్తుందని, తర్వాత పని చేయదని పేర్కొంది. ఇక జియో ఫోన్లు వాడే వినియోగదారులు ఖంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. Kai ఆపరేటింగ్ సిస్టం 2.5.1కు పైన నడిచే అన్ని మొబైల్స్ లోనూ వాట్సాప్ పనిచేయనుంది. వీటిలో జియో ఫోన్, జియో ఫోన్ 2 కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఫోన్లలో వాట్సాప్ ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకుంటూ కొత్త ఫీచర్లను ఎంజాయ్ చేయవచ్చు.