షావోమీ ‘పోకో ఎఫ్1’ ధర ఎంత తగ్గిందో తెలుసా..?

ప్రముఖ మొబైల్స్ సంస్థ షావోమీ తన ‘పోకో ఎఫ్1’ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.1000 తగ్గించి వినియోగదారులకు ఆనందం కలిగించింది. తగ్గిన ధర తో ఈ ఫోన్‌కు సంబంధించి 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.19,999 అందుబాటులోకి రాగా , 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.22,999 కు, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.27,999 కు, 256జీబీ స్టోరేజ్ ఆర్మర్డ్ ఎడిషన్ ధర రూ.28,999 కు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

పోకో ఎఫ్1 ఫీచర్లు చూస్తే..

* 6.18 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
* సెల్ఫీల కోసం సూపర్ పిక్సెల్ 20 ఎంపీ ముందు కెమెరా
* వెనుక 12ఎంపీ + 5ఎంపీ ఏఐ డ్యుయల్ కెమెరా
* ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
* 6జీబీ/8జీబీ ర్యామ్‌
* 64జీబీ/128జీబీ/256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (మైక్రోఎస్డీతో 256జీబీ వరకు పెంచుకునే వీలు)
* డ్యుయల్ సిమ్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ