పునః ప్రారంభమైన యూట్యూబ్..

వరల్డ్ వైడ్ గా యూట్యాబ్ సేవలు నిలిచిపోవడం తో అందరు ఆందోళనలో పడ్డారు. ఏ చానెల్ సర్చ్ చేసినా… ఏ వీడియో వెతికినా…ఏది చూద్దామన్నా కానీ వీడియో కనిపించలేదు. దీంతో యూట్యూబ్ నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు. అసౌకర్యానికి మేం చింతిస్తున్నామని, వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ ఓ ప్రకటన ఇచ్చారు.

తాజాగా పునః ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. యూట్యూబ్, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌లో సంగీతం మొదలగున్నీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. 24 గంటలు యూట్యూబ్ తో గడిపే వారు ఒక్కసారిగా యూట్యూబ్ పనిచేయక పోయేసరికి ఏదో కోల్పోయాం అనే బాధలో పడిపోయారు. రెండు మూడు గంటలు పనిచేయకపోయేసరికే అల్లాడిపోతే ఎలా అని మరికొంతమంది అంటున్నారు. మొత్తం మీద మళ్లీ యూట్యూబ్ ఓపెన్ అయేసరికి అంత ఊపిరి పీల్చుకుంటున్నారు.