
Fauzi Poster: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం నాటి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ అభిమానుల్లో సరికొత్త జోష్‌ను నింపుతోంది. తాజా పోస్టర్లో ప్రభాస్ ఇప్పటివరకు చూడని అత్యంత ఇంటెన్స్, ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ఒంటిపై రక్తపు మరకలతో.. చేతుల్లో పవర్ఫుల్ తుపాకులు పట్టుకుని రౌద్రంగా దర్శనమిచ్చారు. ప్రభాస్ కళ్లలో కనిపిస్తున్న ఆగ్రహం, యాక్షన్ ఇంటెన్సిటీ పోస్టర్‌కు మరింత బలాన్ని తీసుకొచ్చాయి. ఈ పోస్టర్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో అంశం చార్మినార్. ప్రభాస్ వెనుక హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం మంటల్లో కాలిపోతున్నట్లు చూపించారు. దీంతో సినిమాలోని యుద్ధం, సంఘర్షణ, ఉద్రిక్తత ఏ స్థాయిలో ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.
అంతేకాకుండా పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో గాంధీజీ వేషధారణను పోలిన ఛాయలు కనిపిస్తున్నాయి. “A BATTALION WHO FIGHTS ALONE” అంటూ ఇచ్చిన క్యాప్షన్ కూడా సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. అంటే.. ఒంటరిగా పోరాడే ఓ సైనికుడి కథను దర్శకుడు చూపించబోతున్నారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ‘ఫౌజీ’ కథ భారత స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారనే వార్తలు కూడా చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజా పోస్టర్లో చార్మినార్ విధ్వంసం, గాంధీజీ ఛాయలు, యుద్ధ వాతావరణం కనిపించడంతో కథపై మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. నిజాం పాలన కాలం, తెలంగాణలో జరిగిన పోరాటాలు కూడా కథలో భాగమై ఉండొచ్చనే చర్చ సాగుతోంది. అయితే వీటిపై చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, చైత్ర జె. అచార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి తాజా పోస్టర్‌తో ‘ఫౌజీ’పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్ రౌద్ర అవతారం, చార్మినార్ విధ్వంసం, దేశభక్తి ఎలివేషన్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.














