Site icon TeluguMirchi.com

రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు


పోలవరం నిర్వాసితుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్ ను సోము వీర్రాజు ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో ఏక కాలంలో ఈ సభలు ప్రారంభమవుతాయన్నారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి నీరు ఇవ్వకపోతే బీజేపీ ఆందోళన చేపడుతుందన్నారు. పోలవరం నిర్వాసితుల లిస్టు కేంద్రానికి ఇవ్వకుండా శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version