Site icon TeluguMirchi.com

ys sharmila: వైఎస్ షర్మిల ఇంటికి మరోసారి పెళ్లి కళ.. కూతురుకి కాబోయే వరుడి ఫోటో ఇదే!

YS Sharmila

ys sharmila: ఏపీ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ వైఎస్‌ షర్మిల ఇంటికి మరోసారి పెళ్లి కళ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా షర్మిల సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. 2024లో వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయం అయినట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. దీంతో షర్మిల కుటుంబంలో మరోసారి పెళ్లి వేడుకలు అంగరంగ వైభంగా జరగనున్నాయి. తాజాగా షర్మిల తన కుమార్తె వైఎస్‌ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు షర్మిల. కర్నూలు జిల్లాకు చెందిన సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డి దంపతుల కుమారుడు డాక్టర్‌ సోమల రఘురామ్‌ రెడ్డితో తన కుమార్తె వివాహం జరగనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంజలి, రఘురామ్‌ రెడ్డిల ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.

వరుడి కుటుంబం కర్నూలు జిల్లాకు చెందినదని, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినట్లు షర్మిల పేర్కొన్నారు. తమ కుమార్తె వివాహం నిశ్చయమైన ఈ శుభ సందర్భాన్ని దేవుడి దయగా భావిస్తున్నామని ఆమె తెలిపారు. వివాహ వేడుకలు ఘనంగా జరిగేలా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆశీర్వదించాలని, ప్రార్థించాలని షర్మిల దంపతులు కోరారు. అంజలి, రఘురామ్‌ రెడ్డి వివాహం నిశ్చయమైనట్లు షర్మిల ప్రకటన చేయడంతో.. ఇంతకాలం లో ప్రొఫైల్‌లో ఉన్న అంజలి గురించి, ఆమెకు కాబోయే భర్త రఘురామ్‌ రెడ్డి గురించి నెటిజన్లు ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version