Site icon TeluguMirchi.com

Lucky Zodiac Signs : గజకేసరి యోగాలు.. ఈ రాశులవారికి జూలై చివరి మూడు రోజులు వెర్రీ లక్కీ..!

Astro

Lucky Zodiac Signs : ఈ నెల జూలై 29, 30, 31 తేదీల్లో ఆకాశంలో మూడు శుభ యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. గజకేసరి యోగం, బుధాదిత్య యోగం, చంద్ర మంగళ యోగం వంటి మహా యోగాలు కలసి సంభవించడం అరుదైన అదృష్టం. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అత్యుత్తమ ఫలితాలను ఇవ్వనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృషభం, మిథునం, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీనం రాశివారికి అదృష్టం పుంజుకుంటుందని చెబుతున్నారు.

వృషభం రాశి: ఈ యోగాల ప్రభావంతో వృషభరాశివారు అన్ని రంగాల్లో అదృష్టవంతులు కానున్నారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి. ఉద్యోగంలో పదవీ ప్రమోషన్లు వస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయి. షేర్లలో, ఆర్థిక పెట్టుబడుల్లో లాభాలు సాధ్యమే.

మిథునం రాశి: ఈ రాశివారికి పేరు, ప్రతిష్ట, ఆదాయం పెరుగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో పెద్ద అవకాశాలు దక్కుతాయి. జీతభత్యాలు, లాభాలు అంచనాలను మించి వస్తాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు లభిస్తాయి.

వృశ్చికం రాశి: వృశ్చికరాశివారికి అపారమైన ధనలాభం సూచనలున్నాయి. భూ లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుతుంది. విదేశీ సంపాదన అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య భాగ్యం మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి: గజకేసరి, బుధాదిత్య, చంద్ర మంగళ యోగాల కలయికతో ధనుస్సురాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్లలో పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అధికార పదవులు దక్కే అవకాశం ఉంది.

మకరం రాశి: ఈ రాశివారికి ధన యోగం, రాజ యోగం రెండూ కలసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త స్థాయికి చేరతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, కొత్త అవకాశాలు వస్తాయి. ఆస్తి వివాదాలు మీ అనుకూలంగా పరిష్కారమవుతాయి.

మీనం రాశి: ఈ రాశివారికి ఈ మూడు యోగాల వల్ల జీవనంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభం, విదేశీ సంపాదన అవకాశాలు ఉంటాయి. వివాహం, కుటుంబ విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింట్లోనూ విజయాలు సాధ్యమే.

Exit mobile version