
Lenin: అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘లెనిన్’ (LENIN). తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్తను నిజం చేస్తూ మేకర్స్ ఒక సంచలన విషయాన్ని ప్రకటించారు. నిజానికి ఈ జూన్ నెలలో విడుదల కావాల్సిన చిత్రాల్లో అత్యంత క్రేజ్ ఉన్న ఈ సినిమా ఇదే. కానీ ఈ సినిమా వాయిదా పడినట్లు తాజాగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రం ఈ ఏడాది జూలై 10, 2026న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తాజాగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్‌ను పంచుకుంది. “భావోద్వేగాల సునామీ.. ప్రేమాభిమానాల ఉప్పెన.. వెండితెరపై ఒక బ్లాక్‌బస్టర్ అనుభూతిని అందించేందుకు ‘లెనిన్’ సిద్ధమవుతోంది” అంటూ సినిమాపై అంచనాలను పెంచేసింది.
A storm of emotions.
A storm of love.
Building up to a BLOCKBUSTER EXPERIENCE ❤️🔥❤️🔥#LENIN in theatres on JULY 10th, 2026. 💥💥#LeninOnJuly10th @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla @leonbrittodp… pic.twitter.com/x3F0LBsKmg— Sithara Entertainments (@SitharaEnts) June 15, 2026
