Site icon TeluguMirchi.com

Lenin Update : క్లైమాక్స్ షూట్ కి సిద్దమైన అఖిల్ ?

Lenin akhil
అక్కినేని యంగ్ హీరో Akhil Akkineni తన ప్రతిష్టాత్మక చిత్రం ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ దర్శకుడు Murali Kishor Abburu తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పవర్‌ఫుల్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. రాయలసీమ, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంగా సాగే ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో ‘సలార్’ ఫేమ్ Pramod Panju కీలక సహాయ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అలాగే మరో యంగ్ హీరోను కూడా మేకర్స్ సంప్రదించినట్టు టాక్. హీరోయిన్‌గా Bhagyashri Borse నటిస్తుండగా, అఖిల్-భాగ్యశ్రీ మధ్య లవ్ ట్రాక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ చెబుతోంది. ఒకవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

మొదట ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని ప్రకటించినప్పటికీ, తాజాగా విడుదలైన పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేకపోవడంతో వాయిదా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావడం అని తెలుస్తోంది. దర్శకుడు Buchi Babu Sana రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాతో పోటీ పడటం రిస్క్‌గా భావించిన ‘లెనిన్’ మేకర్స్ విడుదలను వాయిదా వేసినట్టు సమాచారం. కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత లేకపోయినా, మే చివర్లో లేదా జూన్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశముందని టాక్. అఖిల్ కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.

Exit mobile version