Site icon TeluguMirchi.com

Allu Arjun: అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్.. ‘రాకా’లో మూడు పాత్రలు!

Raaka

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఫాంటసీ, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతుండగా.. అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ‘రాకా’లో అల్లు అర్జున్ ఏకంగా మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, అతని ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇప్పటికే అల్లు అర్జున్ ‘రాకా’లో పలు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన కొన్ని వార్తల్లో ఆయన తండ్రి పాత్రతో పాటు పోలీస్, హాఫ్ హ్యూమన్–హాఫ్ మాన్స్టర్ వంటి భిన్నమైన పాత్రల్లో కనిపించవచ్చని పేర్కొన్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న తండ్రి–ఇద్దరు కొడుకుల గెటప్ నిజమైతే.. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మూడు పాత్రల మధ్య ఉండే భిన్నమైన బాడీ లాంగ్వేజ్, లుక్స్, మేనరిజమ్స్‌ను ఆయన ఎలా చూపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అట్లీ సినిమాల్లో మల్టిపుల్ రోల్స్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండటం తెలిసిందే. ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘జవాన్’ వంటి చిత్రాల్లోనూ విభిన్న పాత్రలను వెండి తెర పై ఆవిష్కరించిన అట్లీ.. ఈసారి అల్లు అర్జున్‌తో మరింత భారీ స్థాయిలో ప్రయోగం చేస్తున్నట్లు టాక్.

‘రాకా’లో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ విస్తృతంగా ఉండటంతో దీనిని రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశాన్ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. మొత్తంగా అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం నిజమేనా? తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రలేనా? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సిందే.

Exit mobile version